Dec 13,2022 00:09

సీలేరులో కురుస్తున్న మంచు

ప్రజాశక్తి -సీలేరు
మాండూస్‌ తుఫాను నేపథ్యంలో వాతావరణం మరింతగా చల్ల బడటంతో మంచు కమ్మేస్తోంది. పగటిపూట మబ్బులతో కూడిన వాతావరణం ఉండగా, రాత్రి అయ్యే సరికి మంచు దట్టంగా కురుస్తోంది. సోమవారం ఉదయం 8 గంటల వరకు సీలేరు పురవీధులు, జెన్‌కో కాలనీ, మెయిన్‌ బజార్లో దట్టంగా మంచు కురవడంతో ప్రజల అనేక ఇబ్బందులకు గురయ్యారు. వ్యాపారులు 8 గంటల వరకు దుకాణాలు తెరవడానికి సాహసించలేదు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనవి విధంగా సోమవారం మంచు కమ్ముకోవడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రాలేదు. పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు, వృద్ధులు చలికి తాళలేక అనేక ఇబ్బందులు పడ్డారు. సీలేరు మీదుగా మైదాన ప్రాంతానికి వెళ్లే వాహన సోదకులు మంచు తీవ్రతతో రహదారి కనిపించక వాహనాలు నడిపేందుకు నానా అవస్థలు పడ్డారు.