Oct 02,2023 20:48

దత్తాత్రేయస్వామి గుడిలో ఎంపి వేమిరెడ్డి, ఎంఎల్‌ఎ మహీధర్‌రెడ్డి

ప్రజాశక్తి - లింగసముద్రం :మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి దేవాలయాన్ని ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎంఎల్‌ఎ మానుగుంట మహీధరెడ్డి సోమవారం సందర్శించారు.ఈ సందర్భంగా వారు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి చరిత్రను ఆలయ దర్మకర్త పవని నాగేంద్ర ప్రసాద్‌ వారికి వివరించారు. తొలుత ఆలయ ధర్మకర్త,అర్చకులు,సిబ్బంది స్వాగతం పలికారు.