Jun 01,2023 19:03

దస్తగిరిని సన్మానిస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఎల్‌ఐసి కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా కె.దస్తగిరి సేవలు అభినందనీయమని వక్తలు తెలిపారు. గురువారం బ్రాంచి కార్యాలయంలో ఉద్యోగ విరమణ సందర్భంగా కె.దస్తగిరి, కెహనుమంతమ్మకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా బ్రాంచి మేనేజర్‌ బి.సుజిత్‌ కుమార్‌, ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు రఘునాథ్‌ గౌడ్‌, విజరు కుమార్‌, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ల ఉద్యోగుల సంఘం నాయకులు సుధాకర్‌ రావు, ఏజెంట్ల సంఘం నాయకులు ప్రభాకర్‌ రెడ్డి, ఆదోని బ్రాంచి ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు ధర్మరాజు మాట్లాడారు. గత 38 ఏళ్లుగా ఎల్‌ఐసిలోని వివిధ విభాగాల్లో పని చేసి ఎక్కడా, ఎవరికీ సమస్య లేకుండా తన పనిని బాధ్యతగా నిర్వర్తించేవారని తెలిపారు. విరమణ పొందిన అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి దస్తగిరి మాట్లాడుతూ... కుటుంబ సభ్యులకు, తనకు ఉద్యోగంలో అండగా నిలిచిన బ్రాంచి సిబ్బందికి, ఏజెంట్లకు కృతజ్ఞతలు తెలిపారు. మహేష్‌ కుమార్‌, గోవర్ధన్‌, మురళీ, శంకర్‌, బ్రహ్మారెడ్డి, వీరారెడ్డి పాల్గొన్నారు.