ప్రజశక్తి - చీరాల
దస్తాలేఖర్ల ప్రమేయం లేకుండా కక్షిదారులే నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి దస్తావేజు రాసుకునే ప్రక్రియ ప్రైమ్ 2.0ను రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో దస్తావేజులు రాసుకునే కొన్ని లక్షల మంది లేఖరులు, డిటిపి ఆపరేటర్లు, స్టాంప్ వెండర్ల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. ఈ నూతన విధానాన్ని నిరసిస్తూ దస్తావేజు లేఖర్లు బుధవారం పెన్ డౌన్ సమ్మె చేపట్టారు. విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దప్తావేజు లేఖరుల సంఘం నాయకులు భాస్కరరావు పలువురు మాట్లాడుతూ నూతన విధానాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. అప్రైమ్ 2.0 విధానం వల్ల అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరుల సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు.










