Oct 15,2023 00:09

ప్రజాశక్తి - పర్చూరు
దసరా పండుగ సందర్భంగా ఎస్సై ప్రసాద్ మండల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా మంచి సూచనలు, సలహాలు ఇచ్చారు. పండుగలకు ఊరెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.  తాళాలు వేసి ఉన్న ఇళ్లు లక్ష్యంగా దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పండుగలకు తాళాలు వేసి సొంతూరికి వెళ్లిన వారి ఇళ్లలో దొంగలు  దోచుకుపోయే అవకాశం లేకుండా ముందుగానే బంగారం, డబ్బు వంటి విలువైన వస్తువులను బ్యాంకు లాఖరులో గాని, ఏ విధంగానైనా సరే భద్రపరుచుకోవాలని సూచించారు. అలాగే పండుగ సందర్భంగా ఎక్కడైనా సరే కోడిపందాలు, జూదం, పేకాట మొదలుగునవి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణాల్లో అతివేగం ప్రమాదానికి దారితీస్తుందని అన్నారు. ఒక్కక్షణం ఆలోచించి నెమ్మదిస్తే ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుందని, అతివేగం విషాదాన్ని నింపుతుందని హెచ్చరించారు.