ప్రజాశక్తి - వేటపాలెం
స్థానిక వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగే దసరా నవరాత్రి ఉత్సవాలకు టిటిడి బోర్డు మెంబర్ శిద్దా సుధీర్‌ను దేవస్థానం కమిటీ అధ్యక్షులు పత్తి ముత్తు కుమరన్ శుక్రవారం ఆహ్వానించారు. ఒంగోలులోని సుధీర్ స్వగృహానికి వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో కమిటి కార్యదర్శి శ్రీరామ్ గోవర్ధనరావు, వైశ్య సంఘం కార్యదర్శి బాపనపల్లి విప్రనారాయణ, విరూపాక్ష యువజన సంఘం అధ్యక్షులు దోగుపర్తి బాలకృష్ణ, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి హరి ప్రసాద్ పాల్గొన్నారు.










