
దసరా మహోత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం
ప్రజాశక్తి - శ్రీశైలం
శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 15 నుండి 24 వరకు నిర్వహించే దసరా మహౌత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రికను జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్‌కు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు అందజేసి శుక్రవారం ఆహ్వానించారు. అలాగే జిల్లా ఎస్‌పి రఘువీరారెడ్డిని, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డిని, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డిని కలిసి దసరా మహౌత్స వాలకు రావాలని ఇఒ ఆహ్వానించారు. స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. అలాగే రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు ఆహ్వాన పత్రికను దసరా మహౌత్సవాలకు రావాలని పర్యవేక్షకులు మధుసూదన్ రెడ్డి, వేద పండితులు కలిసి అందజేసి ఆహ్వానించారు. స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలను ప్రసాదాలను అందజేశారు.