
ప్రజాశక్తి - జగ్గయ్యపేట: విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 15 నుండి 23 వరకు నిర్వహించనున్న దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రికను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వవిప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభానుకు అందజేశారు. ఈ సందర్భంగా ఉదయభానుని ఆయన స్వగహంలో కలసిన దేవస్థాన కమిటీ సభ్యులు, అధికారులు ఆహ్వాన పత్రికను, తీర్థ ప్రసాదాలను అందజేసి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. వన్‌టౌన్ : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై ఈనెల 15 నుండి జరుగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపధ్యంలో పశ్చిమ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస్ దంపతులను వన్‌టౌన్ బ్రాహ్మణ వీధిలోని ఆయన నివాసంలో శుక్రవారం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామారావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా సత్తయ్య, బుద్ధా రాంబాబు కలిసి అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవములు-2023 ఆహ్వాన పత్రికను, ప్రసాదములు అందజేశారు.