రాయచోటి టౌన్ : పోలీసు సిబ్బంది శారీరకంగా, మానసికంగా నిరంతరం దృఢంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని ఎస్‌పి గంగాధర్‌రావు అన్నారు. పోలీసు మైదానంలో శుక్రవారం నిర్వహించిన సివిల్, ఎఆర్, హోంగార్డ్ పోలీస్ సిబ్బంది కవాతును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది శారీరకంగా దఢత్వం కలిగి ఉండాలంటే వ్యాయామం, యోగా ప్రతి రోజు చేయాలని అప్పుడే ఆరోగ్యపరంగా దఢంగా ఉంటారని పేర్కొన్నారు. సిబ్బంది ఆరోగ్య విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే జిల్లా పోలీస్ ఆరోగ్య కేంద్రంలో సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పోలీసులు ఆరోగ్యకరంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతామని పేర్కొన్నారు. అనంతరం ఆయన ముఖాముఖి నిర్వహించారు. పోలీసులకు ఆరోగ్యం విద్య తదితర అంశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఏదైనా సమస్య ఉంటే ప్రమాద దష్టికి తీసుకుని వస్తే సత్వరమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎఆర్ డిఎస్‌పి మహబూబ్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.










