Nov 23,2022 23:44

టి నగర పాలెంలో ప్రారంభమైన భూ సర్వే ప్రక్రియ

ప్రజాశక్తి -భీమునిపట్నం :వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంలో భాగంగా మండలంలోని టి నగరపాలెం, బోడమెట్టపాలెం గ్రామాల్లో బుధవారం డ్రోన్ల సాయంతో సమగ్ర భూసర్వే నిర్వహించారు. తహసీల్దార్‌ కోరాడ వేణుగోపాల్‌ మాట్లాడుతూ, టి నగరపాలెంలో 407 ఎకరాలు, బోడమెట్టపాలెంలో 670 ఎకరాల సర్వే జరపనున్నట్లు వివరించారు. ప్రతి భూకమతాన్ని సర్వే జరిపి, అత్యంత కచ్చితత్వంతో అక్షాంశాలు, రేఖాంశాలు, విశిష్ట గుర్తింపు సంఖ్య, సమగ్ర భూ వివరాలు తెలిపే విధానాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్‌లు పొట్నూరు ఛాయా గౌతమి,ముద్దాడ అప్పయ్యమ్మ, ఎంపిటిసి పల్లా నీలిమ, చెల్లూరి నగేష్‌బాబు పాల్గొన్నారు.