Sep 26,2023 18:29

ప్రజాశక్తి - పెనుమంట్ర
             కూలీల కొరత, సాగు ఖర్చులు తగ్గించడానికి మన విశ్వ విద్యాలయం డ్రోన్‌ పైలెట్‌ శిక్షణ నిర్వహిస్తుందని, దీనిని గ్రామీణ యువత పూర్తిస్థాయిలో వినియోగించుకుని స్వయం ఉపాధి పొందాలాని ఆచార్య ఎన్‌జి.రంగా వ్యవసా య విశ్వ విద్యాలయ ఉపకులపతి (వైస్‌ ఛాన్స్‌లర్‌) డాక్టర్‌ ఆర్‌.శారదా జయలక్ష్మిదేవి, పరిశోధనా సంచాలకులు (డైరె క్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌) డాక్టర్‌ ఎల్‌.ప్రశాంతి అన్నారు. మంగళ వా రం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని వారు సంద ర్శించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ ప్రాంతీ య వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి గతేడాది 135 నుంచి 140 రోజుల కాల పరిమితి కలిగి, ఆంధ్రప్రదేశ్‌, తమి ళనాడు, కర్నాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో సాగు కోసం ఎంటి యు రైస్‌ 1310, ఎంటియు రైస్‌ 1321 రకాలను రూపొందించామని తెలిపారు. ఈ ఏడాది ఈ రకాలపై జోన్‌లో ఉన్న అన్ని విస్తరణ కేంద్రాల్లో క్షేత్ర పరిశీలనలు నిర్వ హిస్తున్నామని తెలిపారు. ప్రత్తి పరిశోధన, విస్తరణ కేంద్రా లలో శాస్త్రవేత్తల కొరత ఉందని, ప్రతి విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో శాస్త్రవేత్తలను నియమిస్తామని తెలిపారు. పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ ఎల్‌.ప్రశాంతి మాట్లాడుతూ మౌలిక వలసతుల కల్పనలో భాగంగా గత మూడేళ్లలో రూ.133 కోట్ల విలువైన పనులను చేపట్టామని తెలిపారు. నాబార్డ్‌, ఆర్‌కెవివై, డిఎస్‌టి, డిబిటి వంటి సంస ్థలకు కూడా ప్రాజెక్ట్‌ ప్రపోజల్స్‌ పంపుతున్నామని, దీని ద్వారా కూడా కొన్ని చోట్ల మౌలిక వసతుల కల్పన జరిగే అవకాశం ఉందని తెలిపారు. పరిశోధనా సంస్థలో పనిచేస్తున్నవారి సమస్య లను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ అసోసి యేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ డాక్టర్‌ ఎం.భరతలక్ష్మి, శాస్త్రవేత్త లు, భోధనేతర సిబ్బంది, పాలిటెక్నిక్‌ సిబ్బంది పాల్గొన్నారు.