Oct 13,2023 21:14

పేయింటర్స్‌ కాలనీలో అక్రమంగా చేపట్టిన ఇంటి నిర్మాణం

బి.కొత్తకోట : మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ భూములు ఆక్రమించినా అడిగేవారు ఉండరన్న ధీమాతో కబ్జాదారులు పేట్రేగిపోతున్నారు. అధికార, అంగబలమే ఆసరాగా భూములు ఆక్రమించి దర్జాగా కొందరు అక్రమంగా కట్టడాలు, మరికొందరు పంటలు సాగు చేస్తు న్నారు. ప్రభుత్వ భూమిపై ఎవరికీ హక్కులుండవు. అయినా కొందరు అక్రమా ర్కులు వాటిని చదును చేసుకుంటున్నారు. తమ ఆధీనంలో ఉంచుకుని ఐదారు సంవత్సరాల తర్వాత వాటిని ఇతరులకు విక్రయించుకుంటున్నారు. నగర పంచా యతీ పరిధిలోని పేయింటర్స్‌ కాలనీలో కబ్జాలు చేయడం సర్వ సాధారణంగా మారిపోయింది. ప్రభుత్వ స్థలం కనపడితే అది నగర పంచాయతీకి సంబం ధించిందా? లేకుంటే ఆర్‌ఎంబిదా? అనే తేడా లేకుండా ప్రభుత్వ స్థలం కనపడితే చాలు వేసేరు పాగా అన్నట్లు వేసేయడం ఆనవాయితీగా మారింది. ఇంత జరుగుతున్న అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసుకుంటూ పోతు న్నారు. ఒకటినైనా కూల్చివేసి ప్రభుత్వ అధికారులు ఉన్నామని నిరూపిం చుకుంటారో లేదోనని పలువురు ప్రజలు పేర్కొంటున్నారు. ఈ విషయం వారి దష్టికి వెళ్లలేదా అంటే వెళ్తున్నా కూడా నిర్లక్ష్యంగా ఉండడంతో కబ్జాదారుల పని సులువైపోతోంది. బి.కొత్తకోట పట్టణంలోని సమీపాన ప్రభుత్వ కాలువగా ఉన్నదాన్ని సైతం ఇంటి నిర్మాణం చేపట్టి మోల్డింగ్‌ వేసేస్తున్నారు. ఈ విషయం స్థానిక ప్రజల ద్వారా తెలుసుకున్న కమిషనర్‌ మనోహర్‌ నిర్మాణం పని ఆపాడే తప్ప, ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న కట్టడాన్ని కూల్చివేయలేదు. పట్టణంలో ఇంత జరుగుతున్నా కలెక్టర్‌ గిరీష్‌ అధికారుల చేత అక్రమ కట్టడాలు కూల్చివేయడానికి అధికారులకు అనుమతులు ఇవ్వలేదేమోనని సందేహాలు తలెత్తుతున్నాయి. ఇటువంటి కబ్జాలపై కలెక్టర్‌ ప్రత్యేక దష్టి సారించి బి.కొత్తకోట నగర పంచాయతీ కమిషనర్‌, రెవెన్యూ అధికారులకు అక్రమ కట్టడాలు కూల్చివేసి తొలగించాలని ఆదేశాలు ఇవ్వాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ స్థలం కబ్జా చేయాలంటే అధికారులు కూల్చివేస్తారని అభిప్రాయానికి కబ్జాదారులు రావాలని ప్రజలు కోరారు. పలుకుబడి ఉపయోగించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు సందేహాలకు దారితీస్తుందని ప్రజలు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు.