Nov 04,2022 23:47

టోల్‌ఫ్రీ నెంబర్‌ పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న సిఐ

జాశక్తి -భీమునిపట్నం : మాదక ద్రవ్యాలు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై శుక్ర వారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో సిఐ వి రామకృష్ణ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు, నాటుసారా, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం తెలిస్తే టోల్‌ ఫ్రీ నంబర్‌ 14500కు తెలియజేయాలని, ఫిర్యాదుదారుని వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.ఎస్‌ఐ డి.పద్మావతి, సిబ్బంది కెవి రావు, ఎన్‌ మధు, వహీదా, దేవి పాల్గొన్నారు.