ప్రజాశక్తి -ఆనందపురం: మండలంలోని శొంఠ్యాం ఎన్‌శ్రీస్‌ఆర్‌ఐటి కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం, రవాణా వల్ల కలిగే అనర్థాలపై శుక్రవారం అవగాహన కల్పించారు. నగర పోలీస్ కమిషనర్, స్పెషల్‌ఎన్‌ఫోర్స్‌్‌మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఎస్‌ఇబి సూపరింటెండెంట్ బి.శ్రీనాధుడు పాల్గొని, డ్రగ్స్, నాటుసారా, ఇతర నిషేధిత వస్తువుల వినియోగం, రవాణా వల్ల కలిగే నష్టాలను పోస్టర్ల ద్వారా వివరించారు. వీటికి సంబంధించిన సమాచారం తెలిస్తే 14500 టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారమిచ్చి సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఇబి భీమునిపట్నం సిఐ వి.రామకృష్ణ, సిబ్బంది మధు, కళాశాల డైరెక్టర్ రాజమురుగం, ప్రిన్సిపల్ ఎండి.ఖాదర్‌బాబు, కె.గోవింద్, కాలేజ్ ఎఒ జిఎ సత్యప్రసాద్, ఇతర అధ్యాపకులు, ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.










