
ప్రభుత్వ సలహాదారు పి.నాగార్జున రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నాయకులు మొసలి పకిరయ్య
మంగళగిరి రూరల్: మంగళగిరి మండలం ఆత్మకూరులో డ్రెయిన్ లు నిర్మిం చాలని కోరుతూ పం చాయితి రాజ్ విభాగ ప్రభుత్వ సలహా దారు పి.నాగార్జునరెడ్డికి సిపిఎం నాయకులు, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు మొసలి పకిరయ్య శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పకిరయ్య మాట్లాడుతూ నిమ్మ గడ్డ రామ్మోహనరావు కాలనీ, జగనన్న కాలనీ, వైఎస్ రాజశేఖరరెడ్డి కాలనీలలో డ్రెయిన్‌ల నిర్మాణం నిర్మాణం సరిగా లేనందున మురుగునీరు పారుదల లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే డ్రెయి న్‌లు నిర్మించి మెయిన్ డ్రెయిన్ లో కలపాలని కోరారు.