Apr 11,2023 23:13

శంకుస్థాపన చేస్తున్న కెకె.రాజు

ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 26వ వార్డు పరిధి శాంతిపురంలో డ్రెయిన్లు, కల్వర్టుల నిర్మాణానికి, చిన్నూరు మసీదులో మరుగుదొడ్లు, వాజుఖానా నిర్మాణాలకు వార్డు వైసిపి ఇన్‌చార్జి పీలా వెంకటలక్ష్మి సమక్షంలో నియోజకవర్గ సమన్వయకర్త కెకె.రాజు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కెకె.రాజు మాట్లాడుతూ, వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కార్పొరేటర్‌ కె.అనీల్‌కుమార్‌రాజు, మాజీ కార్పొరేటర్‌ పోతు సత్యనారాయణ, బులుసు జగదీష్‌, ఫరూకి, ఎం.సునీల్‌, బొడ్డెటి కిరణ్‌, చిన్నూరు మసీదు ప్రెసిడెంట్‌ నవాబ్‌, ఎఇ శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్‌ పాటించరా? : కార్పొరేటర్‌
తన వార్డులో అభివృద్ధి పనులు చేసేటప్పుడు ప్రొటోకాల్‌ పాటించరా అని 26వ వార్డు టిడిపి కార్పొరేటర్‌ ముక్కా శ్రావణి అధికారులను ప్రశ్నించారు. తన వార్డులో వైసిపి నాయకులతో శంకుస్థాపన చేయించడం బాధాకరమన్నారు. చిన్నూరు మసీదు అభివృద్ధికి రూ.20 లక్షలతో వార్డు అభివృద్ధి పనుల కింద గతంలో తాను శంకుస్థాపన చేసిన పనికే మళ్లీ వారు చేయడం రాజకీయ లబ్ధికేనని ఆరోపించారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని జివిఎంసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు.