Jul 27,2023 21:37

ప్రజాశక్తి వార్తకు స్పందన
ప్రజాశక్తి - ముదినేపల్లి

             ఎట్టకేలకు అధికారులు స్పందించి పోల్‌రాజ్‌ డ్రెయిన్‌లో డెక్క తొలగింపు చర్యలు చేపట్టారు. ముదినేపల్లి పోల్‌రాజ్‌ డ్రెయిన్‌ వంతెన కెనాల్‌ వద్ద దట్టంగా పేరుకుపోయిన డెక్కను కూలీలతో తొలగించే పనులు చేపట్టారు. భారీ వర్షాలకు నిండా మునిగిన రైతన్న శీర్షీకతో బుధవారం ప్రజాశక్తిలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించి డెక్క తొలగింపునకు చర్యలు చేపట్టారు.