Jun 08,2023 19:59

వినతి పత్రం అందిస్తున్న డివైఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి - దేవనకొండ
మండలంలోని కుంకనూరు గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవడంతో మురుగునీరు రోడ్ల మీదే ప్రవహిస్తోందని, తాగునీటి పైపులను శుభ్రం చేసి మరమ్మతులు చేయాలని డివైఎఫ్‌ఐ నాయకులు కె.శ్రీనివాసులు, చిన్న, వీరేంద్ర డిమాండ్‌ చేశారు. గురువారం గ్రామ సచివాలయ అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వర్షాకాల సీజన్‌ ప్రారంభమవుతున్న తరుణంలో చిన్నపాటి వర్షాలకు మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందని తెలిపారు. మురుగునీటి కాలువలను శుభ్రం చేయకపోవడంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రెయినేజీ వ్యవస్థను సరిచేయాలని కోరారు. ఉరుకుందు, సింహాద్రి, హరికృష్ణ, రసూల్‌, మురళీ, సుధాకర్‌ పాల్గొన్నారు.