Sep 07,2023 17:16

ప్రజాశక్తి - కొయ్యలగూడెం
    డ్రెయినేజీ సమస్యను పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి శుక్లబోయిన రాంబాబు తెలిపారు. మండలంలోని పరింపూడి పంచాయతీ వాటర్‌ ట్యాంకు రామాలయం రోడ్డులోని డ్రెయినేజీ చెత్తతో పూడుకుపోయి అద్వానంగా తయారైంది. రోడ్డు మీదకు డ్రెయినేజీ నీరు చేరడంతో ఆ వార్డులోని ప్రజలు ఈ నీటిలోంచే నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి శుక్లబోయిన రాంబాబు మాట్లాడుతూ అనారోగ్య పరిస్థితులు, దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంచాయతీ అధికారులు, పైఅధికారులు డ్రెయినేజీ సమస్యను పరిష్కరించకపోతే ఆ వార్డు జనంతో పోరాటం చేస్తామని హెచ్చరించారు.