ప్రజాశక్తి- అనంతగిరి:మండలంలో మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధే దిశగా జిల్లా పరిషత్ నిధులు కేటాయించి పనులు చేపట్టడం జరుగుతుందని జెడ్పిటిసి డి.గంగరాజు పేర్కొన్నారు. బుధవారం టోకురు పంచాయతీ బగ్మరవలసలో డ్రైనేజీ నిర్మాణానికి సీపీఎం సర్పంచ్ కిల్లో. మొస్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ, బగ్మరవలస గ్రామానికి డ్రైనేజీ నిర్మాణనికి జిల్లా పరిషత్ విధులు రూ.5 లక్ష్యాలు కేటాయించి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే సుమారు రూ 20. లక్షల పైగా నిధులు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టోకురు మాజీ సర్పంచ్ సార దొన్ను, పంచాయతీ కార్యదర్శి నక్క. రవికుమార్, సచివాలయం సిబ్బంది శివ రవికుమార్, అమ్మలు, సిపిఎం మండల కార్యదర్శి ఎస్.నాగులు, మండల నాయకులు జి.దేవన్న, వార్డు మెంబర్ పి. లక్ష్మరావు .ప్రసాద్, భీమరాజు గ్రామస్తులు పాల్గొన్నారు.










