ప్రజాశక్తి-పెద్దకడబూరు
పెద్దకడబూరు ఎస్సీ కాలనీలో లింకు రోడ్లు, అంబేద్కర్ విగ్రహం నుంచి హైస్కూల్ వరకు డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నగేష్, మండల కార్యదర్శి దేవదాసు డిమాండ్ చేశారు. ఆదివారం డివైఎఫ్‌ఐ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో పర్యటించి సమస్యలను అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎస్సీ కాలనీలో డ్రెయినేజీల నిర్మాణం లేకపోవడం భారీగా మురుగునీరు, చెత్త చేరి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు. సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. డ్రెయినేజీల నిర్మాణం చేపట్టకపోతే డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. డివైఎఫ్‌ఐ నాయకులు రామన్న, అబ్రహాం, తాయప్ప, జీవరత్నం, ఆదెప్ప, ప్రభుదాసు, ప్రభాకర్, వంశీ పాల్గొన్నారు.
పరిసరాలను పరిశీలిస్తున్న నాయకులు










