శంకుస్థాపన చేస్తున్న జడ్పీటీసీ
ప్రజాశక్తి-హుకుంపేట: మండలంలోని పాతకోట పంచాయతీ సూదిమెట్ట గ్రామంలో జిల్లా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులతో డ్రైనేజి పనులకు స్థానిక జడ్పీటీసీ రేగం మత్స్యలింగం బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతకొద్ది సంవత్సరాలుగా డ్రైనేజీ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న విషయమై జిల్లా పరిషత్ చైర్మన్‌తో మాట్లాడామన్నారు. జిల్లా పరిషత్ నిధులు రూ.15,00000లక్షలు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు.గతం లో ఏ ప్రభుత్వం అభివృద్ధికీ నిదులు కేటాయించిన దాలాలు లేన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పాటి లక్ష్మి, ఉప సర్పంచ్ కొట్టగొల్లి కొండబాబు, వార్డ్ మెంబర్లు జన్ని బొంజుబాబు, వెంగల బొంజుబాబు, పాటి చిన్నయ్య, సోనాభ చిన్నోడు, సెక్రటరీ ప్రదీప్ పాల్గొన్నారు.










