Jan 05,2023 22:45

ప్రజాశక్తి - నూజివీడు
            నూజివీడు పట్టణంలోని రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం ఎదురుగా ప్రయివేట్‌ ఫొటో స్టాట్‌ వద్ద ఉన్న డ్రెయినేజీ చెత్తాచెదారంతో పూడుకుపోయి తీవ్ర దుర్గంధం వ్యాప్తి చెందుతోంది. నెలల తరబడి డ్రెయినేజీలో చెత్త పేరుకుపోయిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రెయినేజీని శుభ్రం చేయాలని కోరుతున్నారు.