శంకుస్థాపన కార్యక్రమంలో ఎంఎల్‌ఎ
డ్రైయిన్ పనులకు ఎంఎల్‌ఎ శంకుస్థాపన
ప్రజాశక్తి-నెల్లూరు:నగరంలోని 8వ డివిజన్ ఆర్.ఎస్.ఆర్. స్కూల్ సమీపంలో గల అరుంధతీయపాళెం వద్ద రూ.1.70 కోట్లతో నిర్మిస్తున్న డ్రెయిన్ పనులకు నగర శాసనసభ్యులు, మాజీ మంత్రి డాక్టర్ పి.అనీల్‌కుమార్ శంకుస్థాపన చేశారు. బుధవారం ఆర్.ఎస్.ఆర్. స్కూల్ నుంచి అరుంధతీయపాళెం మీదుగా హిమాలయ స్కూల్ వెనుకవైపు, అక్కడి నుంచి కామాటి హరిజనవాడ డ్రెయిన్, అలాగే నజీరుతోట నుంచి చిన్నబాలయ్య స్కూల్ వరకు వున్న కాలువను రూ.1.70 కోట్లతో డ్రెయిన్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఎక్స్‌టెన్షన్‌కు మరో రూ.1.00 కోటితో టెండర్లు ఆహ్వానించామన్నారు. దీంతో మొత్తం రూ.2.70 కోట్లతో పూర్తిగా స్థానిక డివిజన్‌తో పాటు 9వ డివిజన్‌లో కొంత భాగం వరకు డ్రెయిన్ పనులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మొగళ్ళపల్లి కామాక్షీదేవి, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.










