డ్రైవర్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి- సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు
రాయచోటిటౌన్ : అద్దె బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు డిమాండ్ చేశారు. గురు వారం స్థానిక ఆర్‌టిసి బస్టాండ్‌లో బస్సు డ్రైవర్లకు భద్రత కల్పించాలని సిఐ టియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లా డుతూ రాయచోటి డిపో కేంద్రం నుంచి వేంపల్లెకు డ్రైవర్ పెదవీటి నరసిం హులు బుధవారం సాయంత్రం 76 మంది ప్రయాణికులు, మరో 50 మంది విద్యార్థులతో కిక్కిరిసిన బస్సుతో వెళ్తున్నారని తెలిపారు. నాగులగుట్టపల్లి వద్ద కొంతమంది బస్సు ఆపారని, ' బస్సులో ఖాళీలేదని వెనుక మరో బస్సు వస్తుంది' అని చెప్పి ముందుకెళ్లారని చెప్పారు. బస్సు నిలబెట్టలేని రామ్మోహన్ అనే వ్యక్తి కారులో వెంబడించి మరో కొంతమందితో కలసి చక్రాయపేట వద్ద బస్సు ఆపి డ్రైవర్‌ను చితకబాది చంపేస్తానని పోలీసుల ముందే బెదిరించాడని పేర్కొ న్నారు. పోలీసులు డ్రైవర్‌ను కాపాడి టీచర్‌ని అదుపులో తీసుకున్నారని చెప్పారు. చక్రాయపేట సర్పంచ్ జోక్యం చేసుకుని కేసు లేకుండా డ్రైవర్ని బెదిరిం చారని తెలిపారు. దాడి చేసింది ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో తూతూ మంత్రంగా 341, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్నారు. వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించాలని కడప డిఇఒకు ఎఫ్‌ఐఆర్ కాపీని పంపాల న్నారు. నిత్యం ప్రజానీకాన్ని సురక్షితంగా వారిని గమ్య స్థానాలకు చేరుస్తున్న డ్రైవర్ల పట్ల చిన్న చూపుతగదని హితువు పలికారు. భవిష్యత్లో డ్రైవర్ల మీద దాడుల నివారణకు, రక్షణకు చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని లేని పక్షాన డ్రైవర్లతో కలసి పెద్ద ఎత్తున సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపడు తామని హెచ్చరించారు. కార్యక్రమంలో భాధిత డ్రైవర్ నరసింహులు, డైవర్లు కర్ణ, మహమ్మద్, రమణ, నాగరాజు, అస్లామ్, సురేష్‌రెడ్డి, రామాంజులు పాల్గొన్నారు. దాడిచేసిన వారిని అరెస్టు చేయాలి : రాయచోటి డిపోనకు చెందిన అద్దెబస్సు డ్రైవరుపై దాడ చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని రాయచోటి డిపో ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు పి.ఎన్.బి.రెడ్డి, అధ్యక్షులు సమద్, డిపో కార్యదర్శి ఈశ్వరరెడ్డి గురువారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. విధి నిర్వాహణలో ఉన్న ఆర్‌టిసి సిబ్బంది తప్పు చేస్తే డిపో మేనేజర్‌కు కానీ, ఉన్నతాధికారులకు కానీ ఫిర్యాదు చేయాలే తప్ప దాడి చేయడం సబబు కాదని తెలిపారు.