
ప్రజాశక్తి-గుంటూరు : రవాణా రంగ కార్మికులపై పెంచిన ఫెనాల్టీలు, ఫీజులు రద్దు చేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం అక్టోబర్ 6న జరిగే చలో విజయవాడను జయప్రదం చేయాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ (ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఎన్.శివాజి పిలుపునిచ్చారు. రవాణా కార్మికుల ప్రచార జాతా శనివారం గుంటూరు నగరంలో వివిధ ఆటో స్టాండ్‌లు, స్కూల్ ఆటో, మినీ లారీ తదితర స్టాండ్‌లలో ప్రచారం నిర్వహించారు. శివాజీ మాట్లాడుతూ యువకులు ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక ఎవరిపై ఆధారపడకుండా ఆటోలు నడుపుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వాల నుండి ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా ఆటో డ్రైవర్లపై ఫీజులు, పెనాల్టీలు పెంచి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శిం చారు. కేంద్ర ప్రభుత్వం రవాణా చట్టానికి సవరణలు చేయాలని ప్రయత్నిస్తే దేశవ్యా ప్తంగా రవాణా రంగ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించటంతో కేంద్రం నేరుగా అమలు చేయటం విరమించుకొని, రాష్ట్రాల ద్వారా అమలుకు యత్నిస్తోందని మండి పడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం జిఒ 21 తెచ్చి చిన్న చిన్న తప్పులకు కూడా రవాణా కార్మికులపై అధికా ఫీజులు, పొరపాటున యాక్సిడెంట్ జరిగి ఎవరైనా మరణిస్తే డ్రైవర్‌కు జైలుశిక్ష, లైసెన్స్ రద్దు వంటి శిక్షలు వేస్తుందని అన్నారు. ప్రపంచ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గినా, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పన్నుల పేరుతో పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతు న్నాయన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్, ఆటో డ్రైవర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో జరిగే పోరాటాల్లో డ్రైవర్లంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిఓ 21 తెచ్చి ఆటో డ్రైవర్ల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోందన్నారు. డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు మస్తాన్‌వలి, గుంటూరు నగర ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి.శంకరరావు, సిఐటి యు గుంటూరు నగర తూర్పు, పశ్చిమ ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, బి.ముత్యాల రావు ప్రసంగించారు. అనంతరం హిందూ కాలేజి, మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా, యూనిటీ ఆటో స్టాండ్, గోరం ట్ల చిల్లీస్ ఆటో స్టాండ్, నల్లచెరువు మినీ లారీ స్టాండ్, గుజ్జనగుండ్ల టాటా ఏసీ స్టాండ్, భాష్యం స్కూల్ ఆటో డ్రైవర్స్ స్టాండు, రైల్వే స్టేషన్, గవర్నమెంట్ హాస్ప టల్, బి.ఆర్.స్టేడియం, బస్టాండ్, వాసవీ క్లాత్ మార్కెట్ వివిధ ఆటో స్టాండ్‌లలో ప్రచారం చేశారు.