Oct 24,2023 23:38

మంగళగిరి: పట్టణంలోని టిడ్కో గృహ సము దాయంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మురుగు పారుదల లేక దోమలు పెరిగి ప్రజలు అనా తరోగ్యానికి గురవుతున్నారు. టిడ్కో గృహాల్లోకి లబ్ధిదారులు వెళ్లి ఏడాది దాటినా, మౌలిక వసతుల కల్పన మాత్రం జరగ లేదు. కార్పొరేషన్‌ అధికారులు నిర్లక్ష్యం వVి స్తున్నారు. ఇప్పటికే నీటి కొరత తీవ్రం. డ్రైనేజీ వ్యవస్థ అస్త వ్యస్తంగా ఉండటంతో మురుగునీరు పారుదల లేక దోమలు విప రీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అక్కడ నివసించే కుటుంబాల వాళ్లు వైరల్‌ జ్వరాల బారిన పడుతున్నారు. ఈ సమస్యను పరి ష్కరించాలని కార్పొరేషన్‌ అధికారుల దృష్టికి అనేక పర్యాయాలు వినతిపత్రాల ద్వారా తెలియజేసినప్పటికీ ఫలితం లేదని ప్రజలు వాపో తున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్‌ అధికారులు స్పందించి మురుగుపారుదలకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.