ప్రజాశక్తి - చీరాల
పట్టణంలోని మసీదు సెంటర్లో ప్రారంభించిన డ్రైనేజీ పనులను వైసిపి ఇన్చార్జ్ కరణం వెంకటేష్ మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుతో కలసి పరిశీలించారు. నిత్యం వాహనాలతో రద్దిగా ఉండే పట్టణ ప్రధాన రహదారి కావడంతో నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని అన్నారు. డ్రైనేజీ పైప్ లైన్ వేసేందుకు సిమెంట్ రోడ్డులో కటింగ్ మిషన్లతో కోసిన మార్కులను పరిశీలించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా డ్రైనేజీ పారుదలకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పైపుల నిర్మాణ పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.










