Jul 22,2022 23:15

ర్యాలీలో పాల్గొన్న జెడి, జెడ్‌సి, తదితరులు

ప్రజాశక్తి -కంచరపాలెం     వారానికి ఒకరోజు డ్రైడే పాటించడం ద్వారా దోమలను నివారించవచ్చని 'అమత్‌' జాయింట్‌ డైరెక్టర్‌ విజయభారతి అన్నారు. శుక్రవారం 51వ వార్డు అంబేద్కర్‌ నగర్‌, వుడా కాలనీ తదితర ప్రాంతాల్లో జెడ్‌సి మల్లయ్య నాయుడు, వార్డు కార్పొరేటర్‌ రెయ్యి వెంకటరమణలతో డ్రైడే ఫ్రైడే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ డైరెక్టర్‌ విజయభారతి మాట్లాడుతూ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చేస్తే దోమల వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. జెడ్‌సి మల్లయ్య నాయుడు మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతతపై దృష్టి పెట్టాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. డ్రైడే ఫ్రైడేపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జివిఎంసి శానిటేషన్‌, సచివాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
డెంగీపై అవగాహన ర్యాలీ
ములగాడ
: డెంగీ నివారణ మాసోత్సవాల్లో భాగంగా 62వ వార్డులో డెంగీపై అవగాహన, డ్రైడే-ఫ్రైడే స్పెషల్‌ డ్రైవ్‌ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వార్డు కార్పొరేటర్‌ బల్ల లక్ష్మణరావు పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. జివిఎంసి మలేరియా విభాగం, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వాలెంటీర్లు ఇంటింటికి తిరుగుతూ దోమలు, వాటి లార్వాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని, ఇళ్ల పరిసరాల్లో పరిశుభ్రత పాటించడంతోపాటు నీటి నిల్వ లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజారోగ్య శాఖ నోడల్‌ అధికారి నాగశ్రీను, ఎంపీహెచ్‌ఎస్‌ సూర్యనారాయణ, వార్డు శానిటరీ ఇనిస్పెక్టర్‌ శ్రీనివాస్‌, మల్కాపురం ఏరియా మలేరియా ఇనిస్పెక్టర్‌ డి రవికుమార్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ రోమాల వేణుబాబు, మలేరియా సూపర్‌వైజర్‌ దుల్లా శ్రీనివాసరావు, శానిటరీ మేస్త్రీలు రమణ, గోవింద్‌, అడ్మిన్లు నాగరాజు, మహేష్‌, హెల్త్‌ సెక్రటరీ రమ్య, శానిటరీ సెక్రటరీలు ప్రదీప్‌, వెంకునాయుడు, శ్రీనివాసరావు, రమాదేవి, ఇంజనీరింగ్‌ సెక్రటరీ చైతన్య, ఆశా కార్యకర్తలు విజయలక్ష్మి, సత్యవతి, కన్నయ్యమ్మ, జయలక్ష్మి, రాణి, వైసిపి నేతలు భూషణం, సూర్యనారాయణ, రవి పాల్గొన్నారు.