Sep 26,2023 22:30

   ఏలూరు:శ్రీనివాస ఆర్ట్స్‌ ఇన్సిస్టిట్యూట్‌ హైదరాబాద్‌ వారు నిర్వహించిన 'జయహో గణాధిపా' ఇంటర్‌ నేషనల్‌ డ్రాయింగ్‌ కాంపిటీషన్‌లో జెడ్‌పిహెచ్‌ స్కూల్‌ శనివారపు పేట విద్యార్థులు మెరిట్‌ లిస్ట్‌ సాధించారని హెచ్‌ఎం జి.ప్రకాశరావు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఇఒ రంగయ్య చేతుల మీదుగా విద్యార్థులు కె.గాయత్రి 6వతరగతి, యత్రికమీ 7వ తరగతి, ఎ.ప్రత్యూష 7వ తరగతి, ఎస్‌.రుద్రసాయి నాయుడు 7వ తరగతి, ఎ.నాగరాజు 8వ తరగతి, కె.ప్రేమ్‌ కుమార్‌ 8వ తరగతి బహుమతులు అందకున్నారు. పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులకు చక్కని తర్పీదు ఇచ్చిన డ్రాయింగ్‌ ఉపాధ్యాయుడు ఎండి.ఇర్షాద్‌ అహ్మద్‌ను అభినందించారు.