Aug 23,2023 22:02

వాలంటీర్లతో మాట్లాడుతున్న డిఇఒ ప్రేమ్‌కుమార్‌

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : స్థానిక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల డ్రాపౌట్స్‌ పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిఇఒ ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ ఉపాధ్యాయులు, వాలంటీర్లను ఆదేశించారు. బుధవారం ఆయన స్థానిక గ్రామ సచివాలయాన్ని సందర్శించి అక్కడ ఉన్న గ్రామ వాలంటీర్లతో చర్చించారు. ఎక్కువగా ఈ పాఠశాలలో డ్రాపౌట్స్‌ లేకుండా చూడాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. డిఇఒతో పాటుగా డిఆర్‌డిఎ పిడి కిరణ్‌ కుమార్‌, గ్రామ సర్పంచి బి.గౌరీ శంకర్రావు, మండల ఉపాధ్యక్షులు ఎన్‌. శేఖర్‌ ఉన్నారు.