డ్రాగెన్ ట్రెయిన్ ఎగ్జిబిషన్ ప్రాంతం పరిశీలన
డ్రాగెన్ ట్రెయిన్ ఎగ్జిబిషన్ ప్రాంతం పరిశీలన
'ప్రమాదపు అంచున డ్రాగెన్ ట్రెయిన్' వార్తకు స్పందన
ప్రజాశక్తి-వెంకటగిరి: వచ్చే నెల 4,5 తేదీల్లో నిర్వహించనున్న శ్రీపోలేరమ్మ జాతర సందర్భంగా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన 'డ్రాగెన్ ట్రైయిన్ ప్రమాదపు అంచున ఏర్పాటు' అనే శీర్షికన ప్రజాశక్తిలో వచ్చిన కథనానికి అధికార యంత్రాంగం కదిలింది. మున్సిపల్ కమిషనర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులకు నోటీసు ఇచ్చారు. గూడూరు డిఎస్‌పి సూర్యనారాయణరెడ్డి స్వయంగా ఎగ్జిబిషన్ ప్రాంతాన్ని పరిశీలించి స్థల యజమా నుల, నిర్వాహకులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. డ్రాగెన్ ట్రెయిన్‌ను తొలగించే నిర్ణయం తీసుకోలేదని వెంకటగిరి ఎస్‌ఐ నరసింహా రావు తెలిపారు. ఈయన వెంట టిడ్కో అధికారి కోటేశ్వరరావు ఉన్నారు.










