ప్రజాశక్తి-జగ్గయ్యపేట
కెవిపిఎస్, ఏపీడీకేఎస్ ఆందోళన ఫలితంగా 2 సంవత్సరాల క్రితం డప్పు కళాకా రులకు పంపిణీ చేయాల్సిన డప్పులు, గజ్జలు, డ్రస్సులు జగ్గయ్యపేట మండల జిల్లా పరిషత్ కార్యాలయం చిల్లకల్లులో శాసనసభ్యులు సామినేని ఉదయభాను, ఎండిఓ కార్యాలయం అధికారులు సమన్వయంతో డప్పులు, గజ్జలు, డ్రస్సులు పంపిణీ చేయడం జరిగిందని కెవిపిఎస్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి జి నటరాజ్ అన్నారు. కళాకారులకు డబ్బులు గజ్జలు డ్రెస్సులు పంపిణీ సందర్భంగా బలుసుపాడు గ్రామ సర్పంచి యడ్లపల్లి సూరిబాబు మరియు కెవిపిఎస్ జగ్గయ్యపేట మండల కేవిపిఎస్ అధ్యక్ష కార్యదర్శులు ఆదిమళ్ళ అబ్రహం, పెద పొంగు సిల్వరాజ్ (లక్ష్మీనారాయణ) బాధ్యులుగా బలుసుపాడు గ్రామ డప్పు కళాకారులకు డప్పులు, గజ్జలు, డ్రస్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జి నటరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డప్పులు, గజ్జెలు, డ్రస్సులు డప్పుకళకారులకు ఇవ్వాలన్నారు. డప్పు కళాకారులకు ప్రస్తుత ఇస్తున్న 3 వేల రూపాయల పెన్షన్ ను 5 వేల రూపాయలకు పెంచి ఇవ్వాలని, ప్రమాద భీమ 5లక్షలు ఇవ్వాలనీ, ప్రోగ్రామ్స్ వెళ్ళె ప్రయాణాలలో రైలు, బస్సులలో టికెట్ రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అమనబోయిన ఆదాము, కె శ్యామ్ సోన్, ఏ వెంకయ్య, పోలంపల్లి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ మాతంగి వెంకటేశ్వర్లు తదితర డప్పు కళాకారులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.










