Sep 30,2023 20:18

మాట్లాడుతున్న లాయర్‌ దోషులను కఠినంగా శిక్షించాలి ప్రజాశక్తి-కావలి

మాట్లాడుతున్న లాయర్‌
దోషులను కఠినంగా శిక్షించాలి
ప్రజాశక్తి-కావలి:రెండు రోజులక్రితం భోపాల్‌ లోని ఉజ్జయినిలో బాలికపై గ్యాంగ్‌ రేప్‌ జరిగి, రోడ్లవెంట ఆ పాప 8 కిలో మీటర్ల దూరం .., అరకొర దుస్తులతో తీవ్రంగా రక్తమోడుతూ సాయంకోసం దీనంగా అరుస్తూ, నడవలేకనడుస్తుంటే, మానవత్వం ఏ కోశానా లేని అక్కడి ప్రజలు ఆ పాప మొర వినకుండా,తలుపులేసుకోవడమో, తరిమివేయడమో చేసి '' ప్రేక్షకుల్లా మిగిలి పోవడం '' మానవత్వానికి మాయని మచ్చ అని కావలి ఉమెన్స్‌ ఫోర్స్‌ కన్వీనర్‌ సి. శారద పేర్కొన్నారు. సి సి కెమెరాల్లో ఈ ఘోరాన్ని చూసిన పోలీసులు ఆపాపకు వస్త్రాన్ని కప్పిఆస్పత్రికి తరలించారు. మహిళాలోకం ' కలిసికట్టుగా పని చేయడానికి ముందుకు రావాలని''కావలి ఉమెన్‌ ఫోర్స్‌'' పిలుపునిస్తుందని శారద పేర్కొన్నారు.