మాట్లాడుతున్న నాయకులు
దోషులను కఠినంగా శిక్షించాలి
ప్రజాశక్తి-మర్రిపాడు:చిత్తూరు జిల్లా వేణుగోపాలపురం గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వడ్డెర వత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గుంజి దయాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన స్థానిక సిపిఎం కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని వస్తుండగా నలుగురు యువకుల్లో ఒకరు బాలికను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆపై నలుగురు అత్యాచారం చేసి గుండు చేసి, కనుబొమలు గొరిగి అతి కిరాతకంగా హత్య చేశారన్నారు. రాష్ట్రంలో వడ్డెర మహిళలు బాలికలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వడ్డెర బాలికపై జరిగిన అత్యాచారాన్ని అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ వేసి రిటైర్డ్ న్యాయమూర్తిచే విచారణ జరిపించి దోషులకు ఉరిశిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మతురాలి తల్లిదండ్రులకు రూ 50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు.కార్యక్రమంలోఐద్వా మండల కార్యదర్శి శ్యామలమ్మ, వడ్డెర వత్తిదారుల సంఘం సభ్యులు, సిఐటియు మండల కార్యదర్శి రత్నయ్య, సిపిఎం సీనియర్ నాయకులు మునగాల సూర్యనారాయణ పాల్గొన్నారు.










