Aug 01,2023 22:00

సమావేశంలో పాల్గొన్న అధికారులు

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : అధికారులు సమన్వయంతో పని చేసి దోషులకు శిక్షపడేలా చూడాలని ఎస్పీ కోరారు. జిల్లా పరిధిలో నమోదైన, రన్‌లో ఉన్న వివిధ వివిధ కేసుల గురించి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీసు అధికారులు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి దోషులకు శిక్షలు పడేలా వ్యవహరించాలని ఎస్పీ పేర్కొన్నారు.ట్రైల్‌ రన్‌ అవుతున్న 75 కేసులలో ప్రతి కేసు పూర్వాపరాలు, ప్రస్తుతం ఆ కేసుల స్థితి మొదలైన విషయాలు గురించి విపులంగా చర్చించారు. ముఖ్యమైన కేసుల్లో విచారణ అధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు సంయుక్తంగా కోర్టు హాజరై కేసులు వీగి పోకుండా దోషులకు కోర్టులో శిక్ష పడేలా వ్యవహరించాలని తెలియజేశారు. కోర్టులో ప్రవేశపెట్టే సాక్షులను కొన్ని రోజులు ముందుగా పిపి ద్వారా సాక్షం చెప్పడం పై వారికి పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. తద్వారా కోర్టు లో కేసులు విగిపోకుండ దోషులకు శిక్ష పడేలా వ్యవహరించవచ్చునని అభిప్రాయపడ్డారు. అలాగే క్రిమినల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ కలిగిన వారిపై కోర్టులో రిటర్న్‌ ఆర్గ్యుమెంట్‌ నమోదు చేయాలని తెలియజేశారు. ఫోక్సో లాంటి కేసుల విచారణ లో చిన్న చిన్న తప్పుల వల్ల కోర్టులో ఒకోసారి కేసులు వీగిపోయే అవకాశం ఉందన్నారు. విచారణలో ఉన్న కేసుకి సంబందించిన పూర్తి సమాచారం పోలీస్‌ సిబ్బంది పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని, కోర్టు కానిస్టేబుల్‌గా విధుల్లో ఉండే సిబ్బందికి అయా కేసులపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. అవసరం అయితే తప్ప కోర్టు కానిస్టేబుల్‌ను మర్చకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జిల్లా అదనపు ఎస్పీ ఎన్‌.విష్ణు, జిల్లాలోని ఎస్‌ డిపిఒలు, సి ఐలు, ఎస్‌ఐలు, డిస్ట్రిక్ట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూటర్‌ కె.రామనాయక్‌, జిల్లా పరిధిలోని ఇతర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు హాజరయ్యారు.