పార్వతీపురం: జిల్లాలో ఓటరు లిస్టు వెరిఫికేషను, ఇంటింటి ఓటరు సర్వే కార్యక్రమం నిబంధనల మేరకు జరుగుతున్నట్లు జిల్లా కలెక్టరు తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా ఇంటింటి ఓటరు సర్వేపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టరు నిశాంత్‌కుమార్ జిల్లాలో జరుగుతున్న డోర్ టు డోర్ సర్వే వివరాలను తెలియజేస్తూ జిల్లాలో 274327 డోరు నెంబర్లు గలవని వాటిలో 138055 డోర్ నెంబర్లు బూత్ లెవల్ అధికారులు వ్యక్తిగతంగా పరిశీలన పూర్తయిందని, 2245 డోర్ నెంబర్లు బిఎల్‌ఒ యాప్‌లో పరిశీలన పూర్తయినట్లు తెలిపారు. జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువత 4072 మంది ఉండగా, 4020 మంది నుంచి ఓటరు నమోదుకు దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో రెండు సమావేశాలు నిర్వహించామని, ఒకే డోరునెంబరులో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న వివరాలు, నూరేళ్లుదాటిన వారి వివరాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రిటర్నింగు, మండల మండల అధికారులు, బూత్ లెవల్ అధికారులతో నిత్యం మాట్లాడుతూ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేస్తున్నట్లు జిల్లా కలెక్టరు తెలిపారు. సమావేశంలో కార్యక్రమంలో జాయింటు కలెక్టరు ఆర్. గోవిందరావు, హెచ్ సెక్షను సూపరింటెండెంటు డి.రవికుమార్ పాల్గొన్నారు.
స్టోన్ ప్లాంటేషను పనులు వెంటనే పూర్తిచేయాలి
రీ సర్వేపూర్తయిన గ్రామాల్లో స్టోన్ ప్లాంటేషను పనులను వెంటనే పూర్తిచేయాలని సర్వే అండ్ సెటల్మెంటు కమిషనరు సిద్దార్థ జైన్ తెలిపారు. గురువారం జిల్లాకలెక్టరు, జాయింటు కలెక్టర్లతో రీసర్వేపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ఫైనల్ ఆర్‌ఒఆర్ పూర్తయిన గ్రామాల్లో స్టోన్ ఫ్లాంటేషను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో నిర్ణీత షెడ్యూలు ప్రకారం రీసర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఫైనల్ ఆర్‌ఒఆర్, స్టోన్ ఫ్లాంటేషను, ఇ-కెవైసీ సకాలంలో పూర్తిచేస్తామని, ప్రభుత్వ భూములు, రోడ్లు గుర్తించి హద్దులు నిర్ణయిస్తున్నట్లు తెలిపారు. సమీక్షలో జెసి ఆర్.గోవిందరావు, డిఆర్‌ఒ జె.వెంకటరావు, సర్వేశాఖ సహాయ సంచాలకులు పాల్గొన్నారు.










