ప్రజాశక్తి-ఆలూరు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగ కార్మికులను దోపిడీకి గురి చేస్తూ, హక్కులను హరించి వేస్తున్నాయని ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్-సిఐటియు) జిల్లా అధ్యక్షులు తిమ్మప్ప తెలిపారు. రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈనెల 6న 'చలో విజయవాడ'లో మహాధర్నాను జయప్రదం చేయాలని మంగళవారం కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అసంఘటిత రోడ్డు రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు, సామాజిక భద్రత చట్టాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. జిఒ 21ని, ఈ-చలానా విధానాన్ని రద్దు చేయాలన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి, 4 లేబర్ కోడ్‌లను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. గాదిలింగ, రాముడు, ఈరన్న, కాశీం, బాష, బాబురావు, అబ్దుల్ పాల్గొన్నారు.
చలో విజయవాడ కరపత్రాలను విడుదల చేస్తున్న ఆటో కార్మికులు










