డోన్ పట్టణ సీఐకు ఘన సన్మానం
ప్రజాశక్తి-డోన్
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డోన్ పట్టణ సీఐ శేషయ్య బదిలీ అయిన సందర్భంగా ఘన సన్మానం చేపట్టినట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏఈ నాగరాజు గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా ఏఈ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాకి ఆదర్శంగా డోన్ పట్టణంలో ప్రజలకు సేవలను అందించారని పార్టీలకతీతంగా ప్రజలకు పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టారని ఫ్యాక్షనిజమును, రౌడీలను,మద్యము,మటక, వ్యభిచారము తదితర అసాంఘిక కార్యక్రమాలను కట్టుదిట్టం చేశారని, అదేవిధంగా ఈవిటీచింగ్ ర్యాగింగ్ తదితర అసాంఘిక కార్యక్రమాలను కూడా ఉక్కు పాదముతో తుడిచివేశారని విధినిర్వహణ లో నిష్పక్షపాతముగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించార ని అతి తక్కువ రోజులలోనే డోన్ పట్టణ ప్రజల అభిమానాన్ని పొందారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంద్యాల డివిజన్ మహిళా విభాగ అధ్యక్షురాలు వనం లక్ష్మీదేవి పాల్గొన్నారు.










