దోబీ ఘాట్లను ఆక్రమణల నుంచి కాపాడండి : ఆర్‌విఎస్
ప్రజాశక్తి - ఆత్మకూరు
పట్టణ పరిధిలోని సంగమేశ్వరం రూట్లో గల ధోబి గాట్లను ఆక్రమిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి కాపాడాలని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి ఎపి రజక వృత్తిదారుల సంఘం నాయకులు మంగళవారం నాడు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా రజక వృత్తిదారుల సంఘం నంద్యాల జిల్లా కన్వీనర్ చందా వారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టణంలో పుట్టగొడుగుల్లా పెరుగుతున్న అక్రమ లేఅవుట్లు వేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా ఆక్రమించే ధోబి ఘాటు స్థలాన్ని దోబీగాట్‌లకు తిరిగి కేటాయించి రజకుల కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి రజకుల స్థలాన్ని రజకులకే ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం పట్టణ అధ్యక్షులు శీలం రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి చందా వారి శివకేశవ, నాయకులు పెద్ద వెంకటసుబ్బయ్య, బావాపురం శ్రీరాములు, శివుడు, జూపల్లె బాదర్లు, సాంబశివుడు, గొందిపల్లె శ్రీనివాసులు, పెద్ద పుల్లయ్య, రజకులు పాల్గొన్నారు.










