Jun 08,2023 23:58

మంగళగిరి రూరల్‌: ప్రజానాట్యం మండలి కళాకారుడిగా, సిపిఎం కార్య కర్తగా దొంత శివయ్య సిపిఎంకు అందించిన సేవలు అమూ ల్యమని సిపిఎం సీనియర్‌ నాయకులు జె వి రాఘవులు అన్నారు. మంగళగిరి మండలం ఖాజా గ్రామానికి చెందిన ప్రజానాట్యమండలి సీనియర్‌ కళాకారుడు, సిపిఎం అభిమాని దొంత శివయ్య సంస్మరణ సభ కాజా గ్రామంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలో వేసి నివాళులు అర్పించారు. జె వి రాఘవులు మాట్లాడుతూ కళాకారుడిగా అనేక ప్రదర్శనను అందించి ప్రజలను చైతన్యపరిచారని అన్నారు. మాజీ సర్పంచ్‌ ఈదా నాగేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఎమర్జెన్సీ సమ యంలో వారి కుటుంబం అందించిన సేవలను కొని యాడారు. కార్యక్రమంలో భీమిరెడ్డి కోటేశ్వరి పాల్గొన్నారు.