Mar 13,2023 21:36

దొంగ ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తి బాలకృష్ణ

దొంగ ఓటు వేసేందుకు యత్నం
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రజాశక్తి - పగిడ్యాల

     పగిడ్యాలలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో దొంగ ఓటు వేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. పగిడ్యాల జడ్పి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 306 పోలింగ్‌ కేంద్రంలో పాత ముచ్చుమర్రి గ్రామానికి చెందిన బాలకృష్ణ దొంగ ఓటు వేసేందుకు వచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన ఏజెంట్‌ వెంటనే పిఒ దృష్టికి తీసుకెళ్లారు. అయితే బాలకృష్ణ తన తమ్ముడి ఓటు వేసేందుకు వచ్చానని చెప్పాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నందికొట్కూరు రూరల్‌ సిఐ సుధారకి రెడ్డి ఆదేశాల మేరకు బాలకృష్ణను అదుపులోకి తీసుకుని ముచ్చుమర్రి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.