Sep 07,2023 19:10

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
దొంగ ఓట్ల చేరికపై వినతి
ప్రజాశక్తి-ఎఎస్‌పేట:దొంగ ఓట్లు చేర్చుతూ.. టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించే ప్రయత్నం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ప్రారంభించారని, అందుకు అధికారులు అప్రమత్తగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీడీపీ నాయకులు గురువారం తహశీల్దార్‌ కు వినతి పత్రం అందించారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షులు అబ్బురి రమేష్‌ నాయుడు మీడియాతో మాట్లాడుతూ బుధవారం సంగం సొసైటీ కార్యాలయంలో వైసీపీ నాయకులు మరికొందరు విఆర్‌ఒలు, వలెంటీర్‌ లతో రహస్య సమావేశం ఏర్పాటు చేసి ఓట్లు చేర్పులు, మార్పులు చేసే విధంగా ప్రణాళిక చేశారన్నారు. సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అడ్డుకున్నారని, నియోజకవర్గంలో అదే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ఎవరైనా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల్లో పోటీ చేసి, ప్రజా తీర్పును స్వాగతించాలే తప్ప, దొడ్డిదారిలు, అక్రమ మార్గాలను ఎంచుకోవటం సిగ్గు చేటని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు కంచర్ల శ్రీహరి నాయుడు, ఖాజామియా, దేవరాల హాజరుత్తయ్య, పులిమి సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.