Nov 09,2023 00:34

క్రోసూరు: పెదకూరపాడు నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల తీరుతోంది. అమరావతి - బెల్లంకొండ డబుల్‌ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్‌ నెలలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా అమరావతి - బెల్లంకొండ డబుల్‌ లేన్‌ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి రోడ్డు పనులు జెట్‌ స్పీడ్‌ లో జరుగుతున్నాయి. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో సిమెంట్‌ రోడ్డు వేయడం మొదలు పెట్టారు. 33 అడుగుల వెడల్పుతో సిమెంట్‌ వేసే పనులను ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ దొడ్లేరులో సెం ట్రల్‌ లైటింగ్‌ కూడా ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుం టున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ నెల 10వ తేదీన సామా జిక సాధికార యాత్ర జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపైమండల ముఖ్య నాయకులతో పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు ధరణికోట జేబీ గార్డెన్స్‌ నుంచి బస్సుయాత్ర ప్రారంభమవు తుందన్నారు.