Jul 13,2023 23:44

డిఇఒ కార్యాలయం ఎదుట ధర్నాచేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-అనకాపల్లి
దొడ్డిదారిన ఉపాధ్యాయుల బదిలీలను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి మాట్లాడుతూ బదిలీల ప్రక్రియ పూర్తయిన తరువాత కూడా అంగబలం, అర్థబలం, రాజకీయ పలుకుబడి ఉన్న ఉపాధ్యాయులకు కేటగిరీ -1కి బదిలీలు చేయడం అత్యంత శోచనీయమన్నారు. వాటిని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయులకు ఇప్పటి వరకూ జీతాలు అందక పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు నెల్లి సుబ్బారావు, అధ్యక్షులు వత్సవాయి శ్రీలక్ష్మి, మహిళా సహాధ్యక్షులు గాయిత్రి, కోశాధికారి జోగ రాజేష్‌, జిల్లా కార్యదర్శులు వి.చైతన్యషీలా, పొలిమేర చంద్ర రావు, ఎన్‌.శేషుకుమార్‌, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.