ప్రజాశక్తి - హెల్త్ యూనివర్శిటీ : నోరు శుభ్రంగా లేకపోతే ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. చిగుళ్ల నొప్పి, పంటి నొప్పి, పళ్ల నుండి రక్తం కారడం, పళ్లు పుచ్చుపట్టిపోవడం, వంటివి అయితే మీరు ఆపంటి నోప్పిని భరించడమే కాదు. ఒకవేళ ఆదంతం తీసేయాల్సి వస్తే నలుగురిలో వెళ్లేందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వీటన్నిటికీ గురికాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ దంతాలపై శ్రద్ద చూపి, పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ మురళీస్ శ్రీ కృష్ణ డెంటల్ కేర్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. నోరు శుక్రభంగా ఉండాలంటే దంతాలు పరిశుభ్రంగా ఉండటం అత్యంత అవసరమన్నారు. లేదంటే పళ్లు పుచ్చిపోవడం, నోరు వాసన రావడం, తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు వస్తాయన్నారు. దంతాలు ఆరోగ్యంగా ఉంటేఉ ఆరోగ్యంగా ఉన్నట్లు అన్నారు. ఎందుకంటే మనం తినే ఆహారమంతా నోటి నుండే పోతుందని, కనుక నోరు శుభ్రంగా ఉండటం తప్పనిసరి అన్నారు. నోరు శుభ్రంగా లేకపోతే ఎన్నో ఇతర అనారోగ్యాలు వస్తాయన్నారు. పంటి సమస్యలు పోషకాల లేమికి కూడా దారితీస్తాయన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో పంటి సమస్యలు ఉండటం వల్ల పోషకాహారం తినకుండా వారు బలహీనంగా మారతారన్నారు. ఓరల్ హెల్త్‌ను మెయిన్ టెయిన్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. రోజూ రెండు సార్లు బ్రష్ చేసుకోవడంతో పాటు రెగ్యులర్‌గా డెంటల్ చెకప్స్ చేయించు కోవాలన్నారు.
బ్రష్ చేసేసమయంలో....
రోజూ బ్రష్ చేసుకునేటపుడు కొన్ని చిన్న విషయాలను గుర్తుంచుకుంటే పంటి సమస్యలను దూరం చేసుకోవచ్చన్నారు. కొంత మంది రుద్దినట్లు బ్రష్ చేస్తారని ఇలా బలవంతంగా చేసే బ్రషింగ్‌తో పంటిపైన ఉన్న సున్నితమైన ఎనామిల్ పొర డ్యామేజ్ అవుతుందన్నారు. దీనితో మీకు సెన్సిటీవిటీ సమస్య పట్టుకువస్తుందన్నారు. మరీ బండగా బ్రష్ చేయవద్దన్నారు. మరికొందరైతే నిముషాల తరబడి బ్రష్ చేస్తారని అలా అతిగా చేయవద్దన్నారు. కొంత మంది నామమత్రాంగా చేస్తారని ఇలా కాకుండా దంతాలను పరిశ్రుభంగ్రా రెండు నుమషాలు బ్రష్ చేసుకోవడం అవసరమని తెలిపారు.
చిగుళ్ల సంరక్షణ అవసరమే....
చాలా మంది దంతాలు బాగుంటే చాలు అనుకుంటారని కాని దంతాలతో పాటు చిగుళ్లు కూడా ముఖ్యమైనవి అన్నారు తరచూ చిగుళ్లు రక్తం కారుతంఏట జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. కరకరలాడే పదార్థాలు తిన్నపుడు చిగుళ్లు గాయాలపాలవుతాయన్నారు. ఏదైనా తిన్న తరువాత చిన్న చిన్న ముక్కలు పంటి మద్యన, చిగుళ్లపై పేరుకోకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. చిగుళ్లపై పదార్థాలు పేరుకుంటే ఇన్ఫెక్షన్లు, వచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి తరచూ నీటితో పుక్కిలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా చేయడం వలన చిక్కుకున్న ఆహారం బయటకు వస్తుందన్నారు.
ఆహారాన్ని నమిలేందుకు దంతాలను వాడాలి...
ఆహారం నమిలి తినేందుకు మాత్రమే దంతాలను వాడాలన్నారు. ఓపెనర్‌గా, ప్యాకేజింగ్ టేపు తీసేందుకు , బట్టలు కుట్టేసమయంలో దారం తెంచేందుకు, నట్స్ పగులకొట్టేందుకు దంతాలను ఉపయోగించవద్దని అన్నారు. దంతాలు చాలా బలంగా ఉన్నాయని పదే పదే ఇటువంటి పనులు చేయడం వల్ల దంతాలు పాడయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఏది ఏమైనా దంతాలతో పాటు,చిగుళ్లు కూడా సంరక్షించుకోవాల్సిన అవసం ఉందని, ప్రతి ఒక్కరూ దంతాలు, చిగుళ్లకు సంబంధించి ఎటువంటి సమస్యల వచ్చినా వెంటనే దంత వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలన్నారు.










