ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్ : స్థానిక వైకెఎంనగర్, ఎస్‌పి కార్యాలయం రోడ్డు ఎదురుగా ఉన్న బాలాజీ నగర్‌కు చెందిన అప్పారావు(63) దంపతులు తమ ద్విచక్ర వాహనంపై పట్టణంలో దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా, తమ వీధి మలుపు తిప్పేలోగా సీతానగరం నుండి రేసింగ్ బైక్‌పై అతివేగంగా వచ్చిన ఇద్దరు యువకులు ఈ దంపతులను బలంగా ఢకొీట్టారు. దీంతో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఇద్దరు యువకులు పరిస్థితి గ్రహించి అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు. స్పందించిన స్థానికులు దంపతులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ భర్త అప్పారావును మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలిస్తుండగా దారిలోనే మరణించాడు. భార్య లక్ష్మి పార్వతీపురం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న యువకుల కోసం గాలిస్తున్నారు.










