Nov 16,2023 19:51

కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కందుకూరు : డంపింగ్‌ యార్డ్‌ వల్ల వచ్చే పొగ, దుర్వాసనతో ఇళ్లల్లో ఉండలేకపోతున్నామని కందుకూరు పట్టణం 12వ వార్డుకు చెందిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆనందపురం రోడ్డు, ఎర్రగుంటపాలెం ప్రాంతాల్లో గురువారం పర్యటించారు. స్థానికులు తమ సమస్యలను ఆయనతో చెప్పుకున్నారు. తమ ఇళ్ల పక్కనే ఉన్న డంపింగ్‌ యార్డ్‌ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని, తీవ్రమైన దుర్వాసన, పొగ వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్‌ యార్డును ఇక్కడ నుంచి వేరే చోటుకు తరలిస్తామంటూ అధికారులు ఏళ్ల తరబడి చెబుతున్నారే కానీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. తొలుత స్థానిక రామాలయంలో ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ మినీ మేనిఫెస్టో లోని అంశాలను వివరిస్తూ కరపత్రాలు పంచారు. పార్టీ పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, వార్డ్‌ అధ్యక్షులు మంగపాటి శ్రీను, స్థానిక నాయకులు కోటపూరి శ్రీను, చెమిడిగుంట రాజశేఖర్‌, జక్కుల వెంకటరావు, గొట్టిముక్కల గోవర్ధన్‌, కసుకుర్తి ప్రభుకుమార్‌, దారా ఆత్రేయ, రెహమాన్‌, సయ్యద్‌, నాయబ్‌, రసూల్‌, హజీర్‌, సిరాజ్‌ , సలాం, ఆరిఫ్‌, సాదు మనోజ్‌, మేడికొండ రమేష్‌, కోరుకొండ విష్ణు, భాస్కరరావు, జక్కుల శ్రావణ్‌ ఉన్నారు.