
ప్రజశక్తి - చీరాల
సమాజంలో నేటికీ దళితుల పట్ల వివక్ష, దాడులు, స్త్రీల మీద హింస, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని, గతంలో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన జస్టిస్ పున్నయ్య సంస్కరణలు అమలు జరగటం లేదని కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ నాయకులు ఎల్ జయరాజు అన్నారు. అక్టోబర్ 2గాంధీ జయంతి నాడున కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆవిర్భవించిందని అన్నారు. కెవిపిఎస్ ఆవిర్భావం జరిగి నేటికీ 25 సంవత్సరంలైన సందర్భంగా స్థానిక ముక్కోణం పార్కు సెంటర్లో సోమవారం కెవీపీఎస్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి నలతోటి బాబురావు, వృత్తిదారుల సంఘం నాయకులు పి కొండయ్య, ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసు రత్నం, పలువురు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా ప్రభుత్వాలు సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఎపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు మళ్లించిందని ఆరోపించారు. రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్నానని చెబుతున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ఉపయోగించాలన్నారు. దేశవ్యాప్తంగా దళితులుపై దాడులు జరుగుతూన్నప్పటికి కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని అన్నారు. దాడుల కట్టడికి చర్యలు శూన్యం అన్నారు. కార్యక్రమంలో నాయకులు నూకతోటి బాబురావు, దేవరపల్లి డేవిడ్, బక్కా జయరామిరెడ్డి, జె విజయ్ కుమార్, వెంకటేశ్వర్లు, బి సుబ్బారావు, డి నారపరెడ్డి, ఎస్‌జె చిరంజీవి, గుంపుల సుధాకర్, ప్రజానాట్యమండలి నాయకులు పి కిరణ్, వెలనాటి కిషోర్, ఎ రామారావు పాల్గొన్నారు.