ప్రజాశక్తి-అమలాపురం
డబ్భై అయిదేశ్ల స్వాతంత్య్ర భారతదేశంలో దళితులపై దాడులు, అత్యాచారాలు సాగుతూనే ఉన్నాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షలు దడాల సుబ్బారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయకార్మిక సంఘం, కెవిపిఎస్ ఆధ్వర్యంలో అమలాపురం స్థానిక ఎంప్లాయీస్ హోం నందు దళిత హక్కులు, సామాజిక న్యాయంపై జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. సదస్సుకు దళిత నాయకులు పెయ్యిల పరుశురాముడు అద్యక్షత నిర్వహించారు. ముఖ్య అతిథిగా హజరైన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షలు దడాల సుబ్బారావు మాట్లాడుతూ మణిపూర్‌లో జరగిన ఘటనలు యావత్ భారతాన్ని తలదించుకునేలా చేసిందన్నారు. మణిపూర్ ఘటనలపై ప్రధానమంత్రి మోదీ మాట్లాడకపోగా దాడులు చేసిన ద్రోహులకు రక్షణ కల్పించడం అత్యంత సిగ్గు చేటన్నారు ఈ ఘటనలను మన రాష్ట్ర పాలక వర్గాలు ఖండించకపోవడం దారుణంగా ఉందన్నారు. దళితులను ఆదిపత్య కులాలు, పాలక పార్టీలకు ఓటు బ్యాంక్‌గా చూస్తున్నాయి తప్ప వారిని మనుషులుగా చూడడం లేదన్నారు. బిజెపి కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్‌ప్లాన్ చట్టాన్ని రద్దు చేసిందనీ రిజర్వేషన్లను అమలు చేయకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నదనీ లౌకిక రాజ్యాంగానికే ప్రమాదం పొంచి ఉందన్నారు. మన రాష్ట్రంలో కూడా రోజురోజుకు దళితులపై దాడులు పెరుగుతున్నాయన్నారు. దళితుల హక్కులను పాలక వర్గాలు కాలరాస్తున్నాయి. దళితులకు భూపంపిణీ చేయడానికి వచ్చిన భూ చట్టాలను, 9/77 అసైన్డ్ చట్టాలను కాలరాసి దళితులకు భూమి లేకుండా చేస్తున్నదనీ భూస్వాముల పక్షాన ప్రభుత్వం నిలబడుతుందనీ ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా దళితులకు ద్రోహం చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో దళితుల హక్కులు, సామాజిక న్యాయం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టామన్నారు. అందులో భాగంగానే సెప్టెంబర్ 29న విజయ వాడలోని ధర్నాచౌక్ వద్ద భారీ ధర్నా చేపట్టనున్నామని ఈ ఆందోళన పోరాటంలో దళిత ప్రజాసంఘాలు ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంతకాల సేకరణ అన్ని మండలాలలో బైక్ ర్యాలీలు నిర్వహించాలని రెండురోజుల పాటు జీపుజాతాలు నిర్వహించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కార్యక్రమంలో దళిత ప్రజాసంఘాల నాయకులు పినిపే రాధాకష్ణ, వడ్డి నాగేశ్వరరావు, అమలదాసు బాబూరావు, యలమంచిలి బాలరాజు కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష్షులు దోనిపాటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ఎస్.తులసీరావు, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షలు కారెం వెంకటేశ్వరరావు, జెవివి జిల్లా ఉపాధ్యక్షలు జనిపల్లి సత్యనారాయణ, అబ్బులు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు జి.హరీష్, జి.మురళీ, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాము బాలయ్య, దైవవాణి, ఇసుకుపట్ల మంగాదేవి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పీతల రామచంద్రరావు, బుంగ సత్యనారాయణ, సిఐటియు జిల్లా కార్యదర్శి జి.దుర్గా ప్రసాద్, టి .మోహనరావు, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
డిమాండ్లు ఇవీ..
1. ఎస్‌సి, ఎస్‌టి ఉప ప్రణాళికా చట్టం ప్రకారం బడ్జెట్లో పక్కదారీ పట్టించిన నిధులను
తిరిగి కేటాయించి ఖర్చుచేయాలి.
2. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుకార్చే 41 సిఆర్‌పిసి ప్రకారం బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకించాలిి
3. ఎస్‌సి, ఎస్‌టిలపై దాదులు, హత్యలు, మహిళలపై అత్యాచారాల కేసులను
విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలి.
4. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి. ఎస్‌సి, ఎస్‌టి ్ట విజిలెన్స్,
మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసి సంఘాలకు కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలి.
5. కులవివక్షత, అంటరానితనం పై ప్రభుత్వమే ప్రచార క్యాంపెయిన్ నిర్వహించాలి. టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి.
6. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రచించిన లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.
8 .బిజెపి మతోన్మాద శక్తులు, మనువాద రాజ్యాంగం అమలుకు చేస్తున్న కుట్రలను తిప్పి కొడదాం.
9. అన్ని సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం కొనసాగించాలి.
10.దళితులకు శ్మశాన స్థలాలు లేని గ్రామాలను గుర్తించి సిసిఎల్‌ఎ
2.10.2022న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కేటాయించాలి
11. శ్మశానాల కై ఇచ్చిన జిఒ 1235 అమలుకు కృషి చేయాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి.
12.దళితులను హత్య చేసిన, శాశ్వత వికలాంగులను చేసిన వ్యక్తి లేదా వ్యక్తుల యొక్క ఆస్తిని ప్రభుత్వం
స్వాధీనం చేసుకొని బాధితులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా చట్టాన్ని రూపొందించాలి.
13. జాతీయ నూతన విద్యా విధానం అమలు వల్ల దళిత విద్యార్థులు విద్యకు దూరం అయ్యే ప్రమాదం వచ్చింది.
నిర్బంధ ఉచిత విద్య హక్కు చట్టం ప్రకారం దళిత విద్యార్థులు చదువుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి.
మూతపడ్డ పాఠశాలలను తెరిపించాలి.
14.డప్పు కళాకారులు, చర్మకారులకు 45 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలి. పెన్షన్ను 5 వేలకు పెంచాలి.
15. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి 3 సెంట్ల ఇంటి స్థలం, 2 ఎకరాల సాగుభూమి కేటాయించాలి.
పక్కా గృహ నిర్మాణానికి రూ.5లక్షలకు పెంచాలి.
16. కోనేరు రంగారావు సిఫార్సులను అమలుచేయాలి. భూస్వాముల ఆక్రమణలో ఉన్న
ప్రభుత్వ భూములు తీసుకొని పేదలకు పంచాలి.
17.అసైన్డ్ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలి,
18 రాయసీమ జిల్లాల్లో వ్య్మశానాల్లో పని చేస్తున్న కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి.
19.రాష్ట్రంలో వ్యాన్ బిఆర్.అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించాలి.
విదేశీ విద్యోన్నతి నిధులు పెంచి ఆరులందరికి శిక్షణ తరగతులు నిర్వహించాలి.
20 .ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి.
21.దళిత, గిరిజనులకు ఇస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు 300 యూనిట్లకు పెంచాలి.
22. కాటికాపరులు, స్కావెంజర్ల సమస్యలు పరిష్కరించాలి.










